calender_icon.png 21 December, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుట్టాయిగూడెం గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటా..

19-12-2025 12:00:00 AM

బుట్టాయిగూడెం గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు

కన్నాయిగూడెం,డిసెంబర్18(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించినందుకు బుట్టాయిగూడెం గ్రామ ప్రజల రుణం తీర్చు కుంటానని బుట్టాయిగూడెం గ్రామ సర్పంచు జాడి రాం బాబు అన్నారు.

ఈ సందర్భంగా జాడి రాంబాబు మాట్లాడు తూ బుట్టాయిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశల కృషి చేస్తానని నాపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో వెనుకంజ వేయనని అన్నారు.

బుట్టాయిగూడెం గ్రామ ప్రజలు నాకు ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని సర్పంచ్ ఒక పదవిగా కాకుండా బాధ్యతగా ఉండి బుట్టాయిగూడెం గ్రామ అభివృద్ధి చేస్తానని తెలిపారు.