calender_icon.png 21 December, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీరాజ్ డైరెక్టర్‌కు మహిళల అభినందనల వెల్లువ

19-12-2025 12:00:00 AM

మంగపేట,డిసెంబర్18 (విజయక్రాంతి)రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ గా ఎంపిక అయిన గుమ్మడి సోమయ్యకు గురువారం మంగపేట మండల మహిళ నాయకురాళ్లు శాలువాలు పుష్ప గుచ్చాలను అందించి అభినందించారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతా చంద్రావతి, కమలాపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షురాలు పోలసాని సరళా రాణి మాట్లాడుతు కష్టానికి తగిన ఫలితం లభించిందని పార్టీని నమ్ముకున్న ఎవ్వరిని పార్టీ నిరాశపరచదని అన్నారు. అనంతరం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అది రేణుక, అల్లాడి వైష్ణవి, అమ్మాయక్క మొదలైన మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.