19-12-2025 12:00:00 AM
హనుమకొండ, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చర్యలపై పోస్టర్ ప్రదర్శనతో పాటు రోడ్డు భద్రతా గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ ముఖ్యఅ తిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఆంగ్ల విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, ఎన్సిసి మరియు లిటరరీ క్లబ్ సహకారంతో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనలను వివరిస్తూ, రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన దృక్పథాన్ని ప్రదర్శించారు.అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి రోడ్డు భద్రత అంశాల పైన అవగాహన కలిగి ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల సృజనాత్మకతను,నిబద్ధతను అభినందించారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమం సమన్వయం, సామాజిక బాధ్యత పట్ల కళాశాల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపక బృందం, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సిసి అధికారులు, ఇంగ్లీష్ విభాగ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.