గోరక్ష కార్యకర్తలకు అండగా ఉంటా
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడు శ్రీ రఘురామ్ శర్మ
మేడిపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి):గోరక్ష దళ్ నాయకుడు,బీజేవైఎం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో గోరక్ష కార్యకర్తల సమావేశం మేడిప ల్లి లోని భారతి మెమోరియల్ ఫౌండేషన్ ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యులు తమిళనాడు గోరక్ష దళ్ అధ్యక్షులు శ్రీ రఘురామ్ శర్మ పాల్గొనారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా మేడిపల్లి లోనీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం స్థాపకులు శ్రీ దుర్గానందపురి స్వామి చేతుల మీదుగా రఘురామ్ శర్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మేడ్చల్ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, గోరక్షదళ్ ఫౌండర్ కోటి శ్రీధర్, గోరక్ష దళ్ రాష్ట్ర అధ్యక్షులు కాలు సింగ్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు రాము యాదవ్, నందు యా దవ్, మేడిపల్లి డివిజన్ బిజెపి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘురామ్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష కార్యకర్తలపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు... హిందువుల ఆరాధ్యదమైన గోమాతను రక్షిస్తుంటే గోరక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం సిగ్గు చేటుఅని పేర్కొన్నారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గోమాత రక్షణకై నిస్వార్ధంగా పని చేస్తున్న మా గోరక్ష కార్యకర్తల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య ఎదురైన అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోరక్ష దళ్, హిందూ సంఘాల నాయకులు, గో భక్తులు తదితరులు పాల్గొన్నారు.






