6 May, 2026 | 4:01 AM

ఫార్మాసిటీ బాధితులకు అండగా ఉంటా

06-05-2026 02:32 AM
  1. మీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ పోనివ్వబోను
  2. గ్రామస్తులతో కలిసి పోరాడేందుకు కమిటీ ఏర్పాటు
  3. ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, యాచారం మండ లాలకు చెందిన మేడిపల్లి, తాటిపర్తి, నానక్ నగర్  కురుమేద్ద, మరలకుంట తండా, మంగళగడ్డ తండా, పోతుబండ తండా గ్రామాల రైతులు తమ భూములను ఫార్మాసిటీ కంపెనీల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గత 53 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాధిత రైతులు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిసి తమ సమస్యలను వివరించి పోరాటానికి మద్దతు కోరారు. రైతుల సమస్యలను విన్న మల్లన్న వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల భూములు ఏ పరిస్థితుల్లోనూ పోనివ్వబోమని, ‘ఒక గజం భూమి కూడా ఇవ్వము’ అనే ధృఢసంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై క్రమబద్ధమైన పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేసి ముం దుకు సాగాలని సూచించారు. అలాగే, గ్రామస్తులతో కలిసి పోరాటాన్ని సమర్థవంతంగా నడిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీని పార్టీ ప్రధాన కార్యద ర్శి వట్ట జానయ్య యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేయాలని మల్లన్న ఆదేశించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైతుల హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి న్యాయపోరాటానికి పూర్తి మద్దతు అందిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.