మీకు అండగా ఉంటాను!
08-08-2026 12:00 AM
- మీ రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయండి: ప్రధాని మోదీ
- ఎన్డీయే కూటమిలో చేరిన ౪౫ మంది ఎంపీలకు పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు ౭: ‘కొత్త కూటమిలో చేరామని ఎవరూ ఆందోళన చెందవద్దు. మీకు నేను అండగా ఉంటాను. ఎన్డీయే అంటే ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో ప్రతిఒక్కరికీ సమాన గౌరవం ఉంటుంది. రాజకీయాల పరంగా ప్రతి సభ్యుడికీ సముచితమైన పదవులు ఇస్తాం.
ఎంపీలందరూ మీ..మీ రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయండి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చా. న్యూఢిల్లీలో శుక్రవారం ఉదయం ఇటీవల ఎన్డీయే కూటమిలో చేరిన ౪౫ మంది ఎంపీలకు ఆయన అల్పాహార విందు ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసం తనను ఏ సమయంలోనా సంప్రదించవచ్చని అభయమిచ్చారు. ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ అంటే ‘ప్రజాస్వామ్యానికి సర్వోన్నత దేవాలయమని అభివర్ణించారు. లోక్‌సభ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని సూచించారు.






