జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
- ‘వందేమాతరం’ గీతానికి చట్టభద్రత
- ఎవరైనా గీతాలాపనకు
- ఆటంకం కలిగిస్తే జైలు శిక్ష
- జాతీయ గేయంతో సమానంగా జాతీయ గీతానికీ భద్రత
న్యూఢిల్లీ, ఆగస్టు ౭: జాతీయ గేయం ‘జన గణ మన’కు సమానంగా జాతీయ గీతం ‘వందేమాతరాని’కి సమాన చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణలు) చట్టానికి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
ఇకపై ఎవరైనా వందేమాతరం గీతాలపను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా, లేదా భంగం కలిగించినా వారు జైలు శిక్షకు అర్హులు. న్యాయస్థానాలు నిందితులకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు శిక్ష విధించే అవకాశ ఉంది. ఇప్పటివరకు కేవలం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గేయం ‘జన గణ మన’కు మాత్రమే చట్టబద్ధత ఉండేది. తాజా బిల్లుతో ‘వందేమాతర’ గీతానికీ చట్టబద్ధత వచ్చిందన్నమాట. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ఈ గీతాన్ని 1950 జనవరి ౨౪న నాటి రాజ్యాంగ సభ జాతీయ గీతంగా ఆమోదించింది.






