23-05-2025 12:00:00 AM
వాషింగ్టన్‌లో ఘటన
వాషింగ్టన్, మే 22: అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ సిబ్బంది ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని జెవిష్ మ్యూజి యం దగ్గర ఈ ఘటన జరిగింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఫీల్డ్ ఆఫీస్ ఈ ఘటన జరిగిన ప్రాంతానికి అత్యం త సమీపంలో ఉంది. కాల్పుల్లో మరణించిన వారిలో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంది.
అమెరికా హోమ్‌లాండ్ సెక్రటరీ క్రిస్టి నోయమ్ ఎక్స్ వేదికగా కాల్పుల విషయాన్ని ధృవీకరించారు. విచారణ కొనసాగుతోందన్నారు. ‘వాషింగ్టన్ డీసీలోని జెవిష్ మ్యూజి యం సమీపంలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబ సీ సిబ్బంది అత్యంత దారుణ స్థితిలో హత్య కు గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. బాధిత కుటుంబాల కోసం భగవంతుడిని ప్రార్థించండి.
ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతాం.’ అని పోస్ట్ చేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎఫ్‌బీఐ డెరెక్టర్ కాష్ పటేల్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో, ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి గిడెయెన్ సార్ మొదలైన వారు విచారం వ్యక్తం చేశారు.