8 June, 2026 | 1:24 AM

కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా

08-06-2026 12:00 AM

రాష్ట్ర చరిత్రలో శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని విస్మరించొద్దు

తెలంగాణ సమాజంలో శ్రీకాంతాచారి జీవించే ఉన్నారు

తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ

నల్లగొండ టౌన్, జూన్ 7: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ అన్నారు. తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియామకమైన ఆమెను విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సమావేశంలో ఆమెను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరణుడని,. తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను సైతం మర్చిపోవద్దు అన్నారు. తన కుమారుడు కాసోజు శ్రీకాంతాచారి తెలంగాణలో ప్రజల గుండెల్లో రాష్ట్ర సాధనలో జీవించే ఉన్నారని కన్నీటి పర్యంతమయ్యారు. విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం ప్రభుత్వంతో కొట్లాడై నా కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు..

తనను గౌరవించేలా అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమెను గజమాలతో సత్కరించారు. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి, ప్రధాన కార్యదర్శి పెందొట సోము, నాయకులు కాసోజు విశ్వనాథం, కొల్లోజు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహము అధ్యక్షుడు కూరెల్ల రమణాచారి  మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.