ఏఈఓ బాలకృష్ణకు ఘన సన్మానం
తిరుమలాయపాలెం, జూన్ 7 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఏఈఓ బాలకృష్ణ బదిలీ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రామసహాయం నరేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ స్వాతి సుమన్ రెడ్డి శాలువాతో సత్కరించి రైతులకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. రైతుల అభ్యున్నతికి బాలకృష్ణ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో పలు కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రైతులకు అండగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూక్యా కనీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సీతారామ్ రెడ్డి, హస్నాబాద్ ఉపసర్పంచ్ మాగి బాలకృష్ణ, వార్డు సభ్యుడు గంధసిరి శ్రీనివాస్, గడ్డం కృష్ణారెడ్డి, గడ్డం అనిల్ రెడ్డి, గంధసిరి లింగమూర్తి, పోలేపొంగు సాయికుమార్, గంధసిరి విజయ్, గంధసిరి శ్రీకాంత్, గంధసిరి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.






