16 April, 2026 | 8:30 AM

ఫాల్స్ కేసులే.. కోర్టులో తేల్చుకుంటా

30-12-2025 12:13 AM

నాపై ఆరోపణలన్నీ అబద్ధం

నాంపల్లి కోర్టు వద్ద ఐ-బొమ్మ రవి 

మీడియాపై చిందులు

ముగిసిన 12 రోజుల కస్టడీ

చంచల్‌గూడ జైలుకు తరలింపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఐబొమ్మ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవి పోలీసు కస్టడీ ముగిసింది. మూ డు వేర్వేరు కేసుల్లో కలిపి మొత్తం 12 రోజుల పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. సోమవారం వైద్య పరీక్షల అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రవి ప్రదర్శించిన తీరు, మీడియా పట్ల ప్రవర్తించిన విధానం చర్చనీయాంశంగా మా రింది.

కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో మీడి యా ప్రతినిధులు రవిని పలకరించే ప్రయత్నం చేయగా.. అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశా డు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా, విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించా డు. మీతో నాకేం మాట్లాడేది లేదు. ఇవన్నీ ఫాల్స్ కేసలు, తప్పుడు ఆరోపణలు. అంతా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ చిందులేశాడు. సరైన సమ యంలో వాస్తవాలన్నీ తానే బయటపెడతానని వ్యాఖ్యానించాడు. కస్టడీ ముగియడంతో రవిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ప్రహ్లాద్ ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు

12 రోజుల కస్టడీలో ఒక్కో కేసులో నాలు గు రోజుల చొప్పున పోలీసులు రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రధానంగా రవి చేసిన ఐడెంటిటీ థెఫ్ట్ గుర్తింపు చోరీ వ్యవహారం విచారణలో వెలుగుచూసింది. బెంగ ళూరుకు చెందిన ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్లను రవి దొంగిలించి, వాటి ఆధారంగా తన పొటోతో నకిలీ పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులను సృష్టించాడు. ఈ వ్యవహారాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు ప్రహ్లాద్‌ను బెంగళూరు నుంచి పిలిపించి రవి ఎదుటే విచారించారు. తన ప్రమేయం లేకుండానే, తన పేరుతో రవి సృష్టించిన నకిలీ పత్రాలను, వాటి ద్వారా జరిగిన లావాదేవీలను చూసి ప్రహ్లాద్ షాక్‌కు గురయ్యాడు. రవి నిర్వహించిన భారీ ఆర్థిక లావాదేవీలపైనా పోలీసులు ఆరా తీశారు. ప్రహ్లాద్ పత్రాలతో తెరిచిన ఖాతాల ద్వారానే ఈ లావాదేవీలు నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.