15 March, 2026 | 3:32 AM

పాక్ క్రికెటర్ సల్మాన్ అఘాకు ఐసీసీ షాక్

15-03-2026 12:33 AM

దుబాయ్, మార్చి 14: పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ అఘా రనౌట్ క్రికెట్‌లో పెను దుమారాన్ని రేపుతున్నది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా సల్మాన్ ఔటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దమని కొందరంటే.. మరికొందరు కాదని వాదిస్తున్నారు. నాన్‌స్ట్రుకర్ లో ఉన్న సల్మాన్ అఘా.. బ్యాటర్ ఆడిన బంతి తన బ్యాట్‌కు తగలడంతో బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు.

కానీ బౌలర్ బంగ్లాదేశ్ కెప్టెన్ అయిన మెహ్‌ది హసన్ మి రాజ్ బంతిని వికెట్లకు కొట్టి రనౌట్ చేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన సల్మాన్ అఘా.. మైదానం వీడుతూ తన గ్లోవ్స్, బ్యా ట్‌ను నేలకేసి కొట్టాడు. దీంతో సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ చర్య ను తప్పుబట్టిన ఐసీసీ.. మ్యాచ్ రిఫరీ నీయముర్ రషీద్ ఫిర్యాదుతో సల్మాన్ అఘా లెవ ల్ 1 నేరానికి పాల్పడినట్టు తేల్చి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

క్రికెట్ వస్తు వులను అగౌరవపరిచినట్టు అఘాపై ఫిర్యా దు అందిందనీ, మైదానంలోనే అతను హె ల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్‌ను విసిరేసినట్టు తేలిందనీ పేర్కొంది. అతను ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. అయి తే బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్‌తో వా గ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనీ ఐసీసీ తెలిపింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్స్ వస్తే ఒక టెస్ట్ లేదా రెండు టీ20లు/వన్డేలు ఆడకుండా నిషేధం విధిస్తారు.