calender_icon.png 16 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 17న ఐసీఎల్ ఫిన్ కార్ప్ కొత్త ఎన్ సిడి ఇష్యూ

15-11-2025 11:34:15 PM

ఫైనాన్షియల్ సెక్టార్ లో అగ్రగామిగా ఉన్న ఐసీఎల్ ఫిన్ కార్ప్ కొత్త పబ్లిక్ ఇష్యూని ప్రకటించింది. నవంబర్ 17న ఆ సంస్థకు చెందిన సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ రాబోతోంది.  12.62% వరకు ప్రభావవంతమైన రాబడితో, ఈ సౌకర్యవంతమైన కాలపరిమితిని కోరుకునే వారికి ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్టు తెలిపింది. గతంలో తమ కంపెనీకి చెందిన ఎన్ సిడి ఇష్యూలకు అద్భుతమైన స్పందన లభించిందనీ గుర్తు చేసింది. కస్టమర్ల యొక్క పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరింత బలమైన ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఎన్ సిడి ఇష్యూ నవంబర్ 28, 2025 వరకు అందుబాటులో ఉంటుందనీ వెల్లడించారు. ప్రతి ఎన్ సిడి రూ.1000 ముఖ విలువను కలిగి ఉంటుందనీ, ఈ ఇష్యూ 13, 24, 36, 60 మరియు 70 నెలల కాలపరిమితితో 10.50% నుండి 12.62% వడ్డీ రేట్లతో నెలవారీ, వార్షిక మరియు సంచిత వడ్డీలతో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. కనీస దరఖాస్తు మొత్తాన్ని రూ.10 వేలుగా నిర్ణయించారు. ఈ ఇష్యూ నుండి వచ్చే ఆదాయాన్ని ఐసీఎల్ ఫిన్ కార్ప్ వృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు,  సేవల నాణ్యతను మరింత పెంచడానికి వినియోగిస్తారని కంపెనీ వెల్లడించింది. దాదాపు 34 సంవత్సరాల వారసత్వంతో ఐసీఎల్ ఫిన్ కార్ప్ సీఎండీ కె.జి. అనిల్ కుమార్ నాయకత్వంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలందిస్తూ ఉండడం గర్వంగా ఉందని పేర్కొంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ మరియు గోవాలో కలిపి మొత్తం 10 రాష్ట్రాలలో ఐసీఎల్ ఫిన్ కార్ప్  విస్తరించి ఉంది.