21-02-2026 12:21:22 AM
శామీర్‌పేట్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలోని లియోనియా రిసారట్స్ లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ వృత్తిని పునర్నిర్మించడమే లక్ష్యంగా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మక రీజినల్ కాస్ట్ అండ్ మేనేజ్ మేంట్ అకౌంటెంట్స్ కన్వెన్షన్ -2026ను నిర్వహించారు.
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండు రోజులు జరుగనున్న ఈ సదస్సు కు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్సిస్ చైర్మన్ ఐసీ ఎం ఏ ఐ మాజీ అధ్యక్షులు సీఎం ఏ డాక్టర్ ఏ ఎస్ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యూహత్మక ప్రభావాన్ని పెంపొందించడం అని ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సుకు దేశ విశేషాల నుంచి సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే లక్షణాలు పెంపొందించడంలో సీఎంఏ పాత్రను బలోపేతం చేయడంపై ఈ సదస్సు ద్రుష్టి సరించిందన్నారు.
ఈఎస్టి (పర్యావరణం, సామజిక, పాలన )గవర్నెన్స్, వ్యాల్యూ ఇంజనీరింగ్ వంటి కీలక రంగాలలో నిపుణులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. తద్వారా స్థిరమైన, బాధ్యతయుతమైన వృద్ధికి ఈ వృత్తి కట్టుబడి ఉందని చెప్పవచ్చన్నారు. ఇది కేవలం చర్చ వేదిక మాత్రమే కాదని ఆచరణత్మక జ్ఞానాన్ని పంచుకునే వేదికని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం ఐఏ విజయ్ కిరణ్ ఆగస్త్య, ఎస్‌ఐఆర్సీ ట్రెజరర్ సీఎంఏ కేవిఎన్ లావణ్య, ఐసీఎంఏఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీఎంఏ ఖాజా జలాల్ ఉద్దీన్, ఎస్‌ఐఎఫ్‌ఏ మాజీ అధ్యక్షులు సీఎంఏ ఏఎన్ రామన్ పాల్గొన్నారు.