4 April, 2026 | 9:50 PM

మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రిలో ఐసియు సెంటర్ ప్రారంభం

04-04-2026 07:46 PM
  • ప్రెసిడెంట్ షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్: ప్రొఫెసర్ కె శివరామకృష్ణ

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందించడానికి వీలుగా అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మెరిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మేడ్చల్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుబంధ మెడిసిటీ ఆసుపత్రిలో ఆధునీకరించి ఐసీయూ కేర్ యూనిట్ ను ప్రారంభించినట్లు ప్రొఫెసర్ కే శివరామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం సాంప్రదాయ బద్ధమైన పూజలు నిర్వహించి మెడిసిటి ఆసుపత్రి సీఈవో ఐ నిష్ మర్చంట్ రిబ్బన్ కట్ చేసి ప్రేక్షకులకు ఐసీయూ యూనిట్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో 20 పడగల కెపాసిటీ కలిగిన ఐసీయూ యూనిట్ లో ఆధునిక వైద్య పరికరాలతో పాటు వెంటిలేటర్ లు డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయబడి అత్యవసర పరిస్థితులలో రోగులకు చికిత్స అందించడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె శివరామకృష్ణ మాట్లాడుతూ మెడిసిటీ ఆసుపత్రి ద్వారా రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు అయిన ధరలో అందించే లక్ష్యంలో భాగంగా ఈ ఆధునీకరణ ఐసీయూను ఆసుపత్రిలో అందుబాటులోనికి తెచ్చిందని చెప్పారు.

తొందరలోనే ఆసుపత్రికి మరిన్ని ఆధునిక వ్యవస్థలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.అనంతరం ఆసుపత్రి సీఈవో ఐనీష్ మర్చంట్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో వచ్చే రోగుల ప్రాణాలు కాపాడటానికి అవసరమైన అన్ని రకా సదుపాయాలు ఐసీయూలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ లు సి గీత.దేవేంద్ర సింగ్ నేగి లతో పాటు ఆసుపత్రి వైద్యులు.నర్సింగ్ పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.