29 August, 2026 | 8:41 PM

Breaking News

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •  

కల్తీ పండ్లను.. ఇలా గుర్తించండి!

11-05-2025 12:00 AM

సమ్మర్ అంటేనే అందరికి గుర్తొచ్చే పండు మామిడి. ఈ పండ్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరు ఎంతో ఇష్టంతో తింటారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లు చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. బాగా కనిపించే పండ్లు అన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. కింది సింపుల్ టిప్స్‌తో కల్తీ మామిడి పండ్లను గుర్తించండి..

* కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు కొద్దిగా మెరుస్తూ కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్ల కంటే పసుపు లేదా నారింజ రంగులో ఎక్కువగా కనిపిస్తాయి.

* కృత్రిమంగా పండించిన మామిడికాయలు కొన్ని రసాయనాలు లేదా వేరే వాసన కలిగి ఉంటాయి.

* కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు సహజంగా పండిన వాటితో పోలిస్తే మృదువుగా లేదా మెత్తగా అనిపిస్తాయి.

* మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో ఉంచాలి. మామిడి పండ్లు నీటిలో మునిగిపోతే అవి సహజంగా పండినవి అని అర్థం. అవి తేలుతుంటే కృత్రిమంగా పండించినవి. 

* నీటిలో కొంచెం బేకింగ్ సోడా వేసి, మామిడి పండ్లను ఆ మిశ్రమంలో 15-20 నిమిషాలు ఉంచాలి. నానబెట్టిన తర్వాత.. మామిడి పండ్లను కడిగినప్పుడు మామిడి పండ్ల రంగు మారితే అవి రసాయనాలతో పండించినవిగా భావించాలి.