calender_icon.png 21 February, 2026 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ కాసింపై కేసుల కొట్టివేత

21-02-2026 01:36:14 AM

తీర్పునిచ్చిన హైకోర్టు 

కాసిం తరఫున అడ్వకేట్ రాహుల్ వాదనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): విధానపరమైన రక్షణ, ప్రాథమిక హక్కులను సమర్థిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాసింపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది.

ప్రొఫెసర్ సి కాసిం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారని, క్యాంపస్‌లో ఇటువంటి నిరసనలను నిషేధిస్తూ రిజిస్ట్రార్ ప్రకటించిన ఆదేశాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కాసిం తరఫున హైకోర్టు అడ్వకేట్ టి రాహుల్ వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. చట్టబద్ధమైన నిషేధాన్ని గుర్తిస్తూ, ప్రొఫెసర్ సి. కాసింపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేసింది.