7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఫీజు బకాయలు రాకపోతే చాక్ డౌన్ చేస్తాం

17-03-2026 01:45 AM

టీఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలు

కామారెడ్డి అర్బన్, మార్చి 16 (విజయక్రాంతి): తెలంగాణ లెక్చరర్ల ఫోరం టిఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా టిఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉండడం వలన వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు వేతనాలు సరిగా పొందక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేసి అధ్యాపకులకు,విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గతంలో చెప్పినట్లుగా పెండింగ్ బకాయిలను విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు,ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో అధ్యాపకులు అందరం కలిసి చాక్ డౌన్ నిర్వహిస్తామని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్,బాల్ రెడ్డి,ప్రభాకర్,మురళి,నరేష్ కుమార్,మోహన్,భాస్కర్, మహిపాల్,సయ్యద్,శ్రీనివాస్, అఖిల్,సతీష్ కుమార్,రాజేష్ అంజయ్య,నర్సింలు,దేవరాజ్ అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది.