13 May, 2026 | 11:53 AM

ఇందిర తెస్తే మోదీ అమ్ముతున్నారు

24-04-2024 12:55 AM

l టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 23( విజయక్రాంతి ): ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వ పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యలను తొలగిస్తే.. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఆ పరిశ్రమలను ప్రయివేట్ వ్యక్తులకు అమ్ముతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.  సోనియాగాంధీ ప్రత్యేక తెలం గాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని, ఆయన కుటుంబమంతా సెట్ అయ్యిందని తెలిపారు. గాంధీభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను, మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను యువత పూర్తిగా తెలుసుకోవాలన్నారు.

స్వాతం త్య్ర ఉద్యమంలో ఇందిరాగాంధీ ఆరేళ్లు జైలు జీవితం అనుభవించారని, జైలు కు వెళ్లిన చరిత్ర బీజేపీ నేతలుకు ఉం దా? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ అపరకాళీ అని మాజీ ప్రధాని వాజ్‌పేయీ పార్లమెంటులో పొగిడారని గుర్తుచేశారు. పుల్వామాలో మన జవాన్లను చంపితే మోదీ నిద్రమత్తులోనే ఉన్నారని విమర్శించారు. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోదీ, అమిత్‌షాలకు లేదన్నారు. కేసీఆర్ ఒక్క రోజు కూడా జైల్లో ఉండలేకపోయారని, ఒక్క రోజుకే కాళ్లు చేతులు కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు.ఇందిరాహయాంలోనే రాష్ట్రానికి బెల్, ఐడీపీఎల్, ఎన్‌ఎఫ్‌సీ, హెచ్‌ఎంటీ, బీడీఎల్, హెచ్‌సీఎల్, డీఆర్‌డీఎల్ లాంటి సంస్థలు వచ్చా యన్నారు. ఇప్పటి యువత భజరంగ్‌దళ్ పాటకు దూకడం కాదని, చరిత్రను తెలుసుకోవాలని  సూచించారు.