5 April, 2026 | 9:56 AM

మా నాన్నను గెలిపిస్తే ..ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..

10-12-2025 12:32 AM
  1. అన్నారంలో పదవులు లేకున్నా గ్రామ అభివృద్ధి కృషి చేస్తా.

అన్నారం గ్రామ ప్రజలకు సొంత ఖర్చులతో కోతుల బెడద నివారణ

ఎన్నారై కుంచాల శ్యాంప్రసాద్ రెడ్డి

తుంగతుర్తి, డిసెంబర్ 9: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి కుంచాల శ్రీనివాస్ రెడ్డి కుమారుడైన కుంచాల శ్యాంప్రసాద్ రెడ్డి గ్రామ ప్రజలను వినూతనమైన రీతిలో తన తండ్రి కోసం ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కుంచాల శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారం గ్రామంలో జన్మించి, ఉన్నతమైన ఆలోచనతో, ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పొంది, జీవనం సాగిస్తున్నాడు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు రావడంతో అన్నారం జనరల్ సీటుకు కుంచాల తన తండ్రి గారైన శ్రీనివాస్ రెడ్డి బిజెపి బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. దీనితో కుమారుడు బాధ్యతగా, తన తండ్రిని గెలిపించాలని, ప్రత్యేకంగా సొంత గడ్డకు చేరుకొని ప్రచారం సాగించాడు. గతంలోనే తన తండ్రి అన్నారం గ్రామానికి పాఠశాలకు దేవాలయాలకు డబ్బులు వెచ్చించి అభివృద్ధి పనులు కొనసాగించినట్లు పేర్కొన్నారు.

ఈసారి ఎన్నికల్లో మా నాన్నగారిని గెలిపిస్తే విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యతో, ఉన్నతమైన ఉద్యోగ ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తానని అన్నారు.  దీనితో  పాటు గ్రామములో విరివిగా కోతుల బెడద ఉన్నందున నివారణకు తన సొంత డబ్బులను వెచ్చించి, రైతుల, గ్రామ ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇకనైనా ప్రజలు గ్రామ అభివృద్ధిని, తలంచి మద్యానికి, డబ్బులకు ఓటు వేయకుండా గ్రామ ప్రజల అమూల్యమైన ఓటును, అభివృద్ధి తలచే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని కోరారు.