10-12-2025 12:31:31 AM
కోదాడ, డిసెంబర్ 9: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన దీరవనిత సోనియా గాంధీ అని టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాలలో సోనియాగాంధీ కీలక పాత్ర పోషించారని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు.
దేశ ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చినప్పటికీ పదవిని త్యాగం చేసిన మహనీయురాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బషీర్, మునావర్, కందుల కోటేశ్వరరావు, చింతలపాటి శ్రీను, పాలూరి సత్యనారాయణ, గంధం యాదగిరి, షఫీ, కట్టే బోయిన శ్రీను, సూర్యనారాయణ, అజీమ్, మదర్, బాజన్ శమీ గంధం పాండు సైదిబాబు, ముస్తఫా పాల్గొన్నారు.