9 August, 2026 | 1:46 AM

అధికారం కోల్పోతే తిరిగి సాధించుకోవొచ్చు

09-08-2026 12:28 AM
  1. సంస్కృతి పోతే మరల రాదు
  2. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
  3. ‘స్వరాష్ట్రంలో స్వయంపాలన’ పుస్తకావిష్కరణ

ముషీరాబాద్,ఆగస్టు 8 (విజయక్రాంతి): అధికారం కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చని, కానీ సంస్కృతిని ఒకసారి కోల్పోతే దాని మూలాలను తిరిగి సాధించుకోవడం కష్టమని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ సంపాదకుడు అల్లం నారాయణ అన్నారు. శనివారం  బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ స్మారకోపన్యాసంలో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమానికి నిర్మాణాత్మక ఆలోచనలు, గణాంకాలతో దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆచా ర్య కొత్తపల్లి జయశంకర్ అని అల్లం నారాయణ పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలపై జయశంకర్ చేసిన విశ్లేషణలు తెలం గాణ ఉద్యమానికి బలాన్ని ఇచ్చాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి, కృష్ణా, గోదా వరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమా నికి టాస్క్ అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, ఓయూ మాజీ వీసీ రవీందర్ యాదవ్, సీనియర్ జర్నలిస్టులు పి. వేణుగోపాలస్వామి, ములక సురేష్, రమణ, చందనం శ్రీకాంత్, ఆసరి రాజు, పులి రాజు, గుడిసె రూబీ స్టీవెన్‌సన్, గురువారెడ్డి, న్యాయవాది జి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘స్వరాష్ట్రంలో స్వయంపాలన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.