చెరువుల్లో మట్టి తరలిస్తే కేసులు తప్పవు
26-05-2024 02:11 AM
రెవెన్యూ శాఖ ద్వారా చెరువుల్లో మట్టి తరలించేందుకు ఎవ్వరికీ పర్మీషన్లు ఇవ్వడం లేదు. ఎవ్వరైనా గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తే కేసులు తప్పవు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు తమ దృష్టి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు.
-శ్రీనివాస్, తహసీల్దార్
మహాముత్తారం






