8 August, 2026 | 5:33 PM

Breaking News

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •   ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.   •   నో పార్కింగ్‌ బోర్డులు.. అయినా అదే తీరు!   •   క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం   •  

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో వెనుకబడిన వర్గాలకు అన్యాయం

26-05-2024 02:06 AM

నిజామాబాద్, మే 25 (విజయక్రాంతి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిజామా బాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక వెసులుబాటు ఉన్న సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం అసంబద్ధమన్నారు. వెనుకబడిన వర్గాలను మద్దతు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. సమాజంలో అన్నివర్గాలకు న్యా యం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభు త్వం నాడు రిజర్వేషన్లు అమలు చేసిందని గుర్తుచేశారు. కేంద్రం ఇప్పటికైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఉపసంహరించాలన్నారు. సామాజిక వెనుకబాటుతనం కొలమానంగా తీసుకుని రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్య దర్శి గడుగు గంగాధర్, నాయకులు జావేద్ అక్రమ్, రామర్తి గోపి, వేణురాజ్, వైశాక్షి సంతోష్ పాల్గొన్నారు.