calender_icon.png 2 November, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాచ్‌లు జారితే కప్ చేజారినట్టే

01-11-2025 12:00:00 AM

-మెగాటోర్నీలో భారత్ ఫీల్డింగ్ పేలవం

-ఫీల్డింగ్ మెరుగుపడితే టైటిల్ ఖాయం

నవీ ముంబై, అక్టోబర్ 31: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు ప్రపంచకప్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం జరగబోయే ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడబోతోంది. అయితే ఈ మెగా ఫైనల్‌కు ముందు భారత్‌కు కొన్ని టెన్షన్స్ ఉన్నా యి. ముఖ్యంగా పేలవమైన ఫీల్డింగ్ కలవరపెడుతోంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ అత్యంత చెత్త ఫీల్డింగ్ జట్టుగా రికార్డులకెక్కింది.

ఎందుకంటే ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్‌లలో కలిపి 35 క్యాచ్‌లు అందుకుంటే 18 క్యాచ్‌లు వదిలేసింది. క్యాచ్ లు అందుకునే సక్సెస్ రేట్ 66 శాతంగానే ఉంది. అలాగే 3 స్టంపింగ్స్, 74 మిస్‌ఫీల్డ్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి. ఆరు ఓవర్ త్రోస్ కూడా ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే చాలు మన ఫీల్డింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థమవుతోంది. ఫీల్డింగ్ మెరుగుపరుచుకోకుంటే మాత్రం ఫైనల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

ఎందుకంటే క్యాచ్‌లు జారితే మ్యాచ్ జారినట్టే కాదు ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్ జారి నట్టే. 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో సూర్యకుమార్ బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా అందుకున్న క్యాచ్‌తోనే భారత్ టైటిల్ గెలిచింది. సూర్య అందుకున్నది క్యాచ్ కాదు వరల్డ్ కప్ అంటూ అప్పట్లోనే చాలా మంది కామెంట్ చేశారు. అలాంటి ఫీల్డింగ్ నుంచి స్ఫూర్తి పొంది భారత మహిళల జట్టు మరింత ఫోకస్ పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.అలాగే మిస్ ఫీల్డ్స్ కారణంగా 22 పరుగులు అదనంగా ఇవ్వడం కూడా జరిగింది.

లీగ్ స్టేజ్‌లో మరో ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ లోపాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఫైనల్లో మరో ఛాన్స్ అనే మాటే ఉండదు. ఖచ్చితంగా అంచనాలకు తగ్గట్టు అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తే సౌ తాఫ్రికాపై గెలిచి ట్రోఫీ అందుకోగలం. 47 ఏళ్లుగా భారత్ మహిళల జట్టును ట్రోఫీ ఊరిస్తూనే ఉంది. 2005లో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత్ కంగారూల చేతిలో ఓడిపోయింది. మరో 12 ఏళ్ల తర్వాత 2017లో మళ్లీ టైటిల్ పోరుకు దూసుకొచ్చినా ఇం గ్లాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. అయి తే ఈ సారి సొంతగడ్డపై మెగాటోర్నీ జరుగుతుండడంతో టైటిల్  నిరీక్షణ కు తెర పడు తుందని అభిమానులు కోరుకుంటున్నారు.