22 April, 2026 | 2:09 AM

క్యాన్సర్ ప్రమాదం ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సాధ్యం

22-04-2026 12:25 AM

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): సమాజంలో పొగాకు గుట్కా మాదకద్ర.వ్యాల వినియోగం కారణంగా పెరుగుతున్న క్యాన్సర్ ప్రమాదం ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ కు ఘనపూర్ మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు చికిత్స సాధ్యమని చెప్పారు.మంగళవారం ఘనాపూర్ మెడిసిటీ ఆసుపత్రిలో హెడ్&నెక్ క్యాన్సర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఘనపూర్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఘనపూర్ కు చెందిన ఈ ఎన్ టి విభాగం ఆధ్వర్యంలో హెడ్&నెక్ క్యాన్సర్ పై ప్రత్యేక అవగాహన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించిన ఈ వారోఉత్సవాలలో ఉచిత పరీక్షలు ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వైద్య విద్యార్థులకు షార్ట్ ఫిలిమ్స్., స్కిట్స్, రంగోలి పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. 

కార్యక్రమంలో ఎంఐ ఎంఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి. ఎంఐఎంఎస్ డాక్టర్ శైలేంద్ర.ఎంఐఎంఎస్ డాక్టర్ సి గీత.డాక్టర్ అంజనీకుమారి ఈఎన్ టి విభాగం ఎంఐఎంఎస్ లతో పాటు ముఖ్య అతిథులుగా డాక్టర్ అచ్యుత్ హెడ్&నెక్ ఎనర్జీ సర్జన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర వైద్య నిపుణులు మాట్లాడుతూ భారతదేశంలో రెండవ స్థానాన్ని నోరు గొంతు మెడ క్యాన్సర్ లు ఆక్రమిస్తున్నాయని అలానే పొగాకు వినియోగం గుట్కా వాడకం ఇతర పరిశుభ్రత అంశాలను క్యాన్సర్ కారణాలుగా వైద్యులు వివరించారు. ఘనపూర్ మెడిసిటీ ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్య విభాగానికి చెందిన పీజీ విద్యార్థులు పొగాకు. మద్యం సేవిస్తే వచ్చే అన ర్ధాలపై స్కిట్ ప్రదర్శించి ఆకట్టు కున్నారు. అనంతరం పలు పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.