19 August, 2026 | 10:22 AM

క్రీడా పోటీలకు రావాలని జిల్లా ఎస్పీకి ఆహ్వానం

19-08-2026 09:41 AM

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన పాల్వంచ ఇంజనీరింగ్ అసోసియేషన్ హాల్ లో జరగనున్న జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, యూనిటీ గోల్డ్స్ జిమ్ నిర్వాహకులు ఎం.డి.నూర్,ఎండి.జాకీర్ ఆహ్వాన పత్రికను అందజేశారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎస్పీకి పోటీల గురించి వివరించి పోటీల ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని అందులో భాగంగా జిల్లాలో క్రీడలు,క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో జిల్లా స్థాయి ఎంకరేజ్మెంట్ బెంచ్ ప్రెస్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.