ఇలా ఉంటే ఆరోగ్యం ఎలా?
జగిత్యాల సర్కార్ దవాఖానలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
అపరిశుభ్రతపై వైద్యసిబ్బందిపై ఆగ్రహం
జగిత్యాల, జూన్ 20 (విజయక్రాంతి): జిల్లా ప్రభుత ప్రధాన దవాఖాన ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరి శుభ్రతకు నిలయంగా ఉంటే రోగులను ఆరోగ్యవంతంగా ఎలా తీర్చిదిద్దుతారని కలెక్టర్ బీ సత్యప్రసాద్ వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం కలెక్టర్ జిల్లా దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని వార్డులను సందరించి, రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై ఆరా తీశారు. వెంటనే ఆ దుకాణాన్ని తొలగించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో శానిటేషన్ నిరహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం లోగా చెత్తాచెదారాన్ని తొలగించాలని బాధ్యులకు సూచించారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ రాములు, ఆర్‌ఎంవో రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.






