15 May, 2026 | 7:25 PM

గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి కృషి

21-06-2024 12:15 AM

మేయర్ గుండు సుధారాణి

రూ.650.౧౨ కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం

వరంగల్, జూన్ 20 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి స్పష్టంచేశారు. వరంగల్ బల్దియా కార్యాలయంలో గురువారం 2024 సంవత్సరానికి ముసాయి దా బడ్జెట్ సమావేశం జరిగింది. రూ.650.౧౨ కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌ను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. రూ.237.౦౨ కోట్లు సాధారణ పన్నుల ద్వా రా, రూ.410.౧౦ కోట్లు  వివిధ గ్రాంట్‌ల ద్వారా సమకూర్చుకొంటామని తెలిపారు. మేయర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం, మంత్రి కొండా సురేఖతోపాటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. మేయర్‌ను పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా అనర్హురాలిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. రెండు పార్టీల కార్పొరేటర్ల మద్య వాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ వాకాడె తదితరులు  పాల్గొన్నారు.