1 September, 2026 | 11:04 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

మిత్రులిద్దరూ ఒకరి స్థానంలోకి ఒకరు మారితే

29-12-2024 | 12:00am

అక్కినేని నాగేశ్వరరావు డ్యుయెల్ రోల్ పోషించిన చిత్రం ‘ఇద్దరు మిత్రులు’. ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజసులోచన, ఈవీ సరోజ, గుమ్మడి, పద్మనాభం, రేలంగి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజయ్, విజయ్ అనే పాత్రలలో అక్కినేని నటించారు. అజయ్, విజయ్ అనే ఇద్దరు ఓ ప్రమాదంలో కలుసుకోవడంతో సినిమా ప్రారంభమవుతుంది.

అజయ్ ఒక వ్యాపారవేత్త కుమారుడు. తండ్రి మరణాననంతరం మేనేజర్ అతని సంపదనంతా దోచుకుని అజయ్‌ను అప్పుల పాలు చేస్తాడు. విజయ్ బాగా చదివి నిరుద్యోగంతో బాధపడుతుంటారు. విజయ్ కుటుంబ కష్టాలు పడుతుంటారు. వీరిద్దరూ ఓ ప్రమాదంలో కలుసుకుంటారు. ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుని ఒకరి పాత్రలోకి మరొకరు వెళతారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ఇద్దరూ సమస్యల నుంచి గట్టెక్కారా.. లేదా? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఆ తరువాత ఇలాంటి కథాంశంతో ఒకట్రెండు చిత్రాలు వచ్చినా కూడా ఈ సినిమా స్థానం దీనిదే.