1 September, 2026 | 11:26 PM

నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం

01-09-2026 | 10:48pm

సెప్టెంబర్ 05న ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలల అధ్యాపకులకు సన్మానం

నేరేడుచర్ల,(విజయక్రాంతి): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(Dr. Sarvepalli Radhakrishnan birthday), ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీల్ఎఫ్) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఘన గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీటీల్ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జె. నరసింహారావు తెలిపారు.నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్,శ్రీ చైతన్య,శ్రీ వాణి  పాఠశాలల్లో కరపత్ర ప్రచార సందర్భంగా అయన మాట్లాడుతూ, విద్యా రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులను “రాధాకృష్ణన్ అవార్డు”తో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలిసి కార్యక్రమ వివరాలను తెలియజేసి, సెప్టెంబర్ 5న జరిగే గౌరవ సన్మాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, సమాజ నిర్మాణానికి ఉత్తమ పౌరులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని  అన్నారు.ఈ కార్యక్రమంలో అంజలి  స్కూల్ ప్రిన్సిపాల్,  సైదిరెడ్డి, సాగర్, అన్వర్, వెంకట్రెడ్డి, జానకిరామయ్య, టీపీటీల్ఫ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి యాదవ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.