calender_icon.png 20 February, 2026 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అంతం.. కొత్త పాలకవర్గం పంతం

20-02-2026 01:15:07 AM

  1. పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాల్లో కొత్త చైర్మన్‌ల ప్రకటన
  2. రెండేళ్లుగా మున్సిపాలిటీలో పలు ఏసీబీ కేసులు 

నిర్మల్, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): జిల్లాలోని నిర్మల్ భైంసా ఖానాపూర్ మున్సిపా లిటీలో గత రెండు సంవత్సరాల నుంచి అవినీతి అక్రమాలు జరిగిన నేపథ్యంలో దీనికి చెక్కుపెట్టినందుకు కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం రోజే శపథం తీసుకుంది. ఇం దు గలడు.. అందు లేడు.. ఎందెందు వెతికిన అవినీతి లంచగొండి అనుచందంగా మారిన మున్సిపాలిటీని ప్రక్షాళన చేసినందుకు కొత్త చైర్మన్లు ప్రజల సమక్షంలోని ప్రకటించడంపై పట్టణ ప్రజలు నష్టం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ ఖానాపూర్ ఖానాపూర్ మున్సిపాలిటీలో వివిధ సెక్షన్లు నిర్వహిస్తున్న కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అవినీతి చేతుల తడు పని ఇది ఏ పని చేయడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో పారదర్శకమైన పాలన అందించేందుకు అన్ని విభాగాల అధికారులు ప్రజలకు మున్సిపాలిటీ పరంగా కనీస సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ఉంది.

ఏ అవసరం వచ్చిన ప్రభుత్వ నిబంధన లోబడి పని చేయాల్సిన అధికారులు పైసలిస్తేనే పని చేసే స్థాయికి ఎదిగారు. మున్సిపల్ పాలకవర్గం ఏడాది క్రిత మే ముగియగా ప్రత్యేక అధికారుల పాలల్లో మున్సిపాలిటీలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధుల ప్రాతినిథ్యం కరువైపోవడంతో అన్ని మున్సిపాలిటీలో అధికారులు ప్రజల అవసరాలను బట్టి అవినీతి అక్రమలకు పాల్పడుతూ మున్సిపాలిటీకి తీరని మచ్చ తీసుకొచ్చారు.

ఏసీబీ కేసులు నిదర్శనం 

నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కొన్ని ఉద్యోగాల అధిపతు లు కాంట్రాక్టు ఉద్యోగులు దినసరి ఉద్యోగులతో కలిసి అవినీతి అక్రమలకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కిన కేసులు చాలానే ఉన్నాయి. పట్టణంలో ఇంటి అసైన్మెంట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, డీజిల్ వార్డురంలో అక్రమాలు. అక్రమ వెంచర్ల అనుమతులు. పట్టణ ప్రణాళిక విభాగం రెవిన్యూ సివిల్ ఇంజనీరింగ్ పనులు ఇలా అన్ని శాఖలు అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

నిర్మల్ మున్సిపాలిటీలో రెండేళ్లలో ఐదుగురు అధికారులు ఏసీబీకి చిక్కగా బైంసాలో ముగ్గురు మున్సిపల్ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఇందులో రెవిన్యూ, పట్టణ ప్రణాళిక ఇతర శాఖల అధికారులు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి అనుమతులు. అసెస్మెంట్లు. ధ్రువీకరణ పత్రాలు. పళ్ళు చెల్లింపుల్లో తదితర అంశాల్లో ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తూ పైసలిస్తే పనులు చేసి పెడుతున్నారు.

దీంతో పట్టణ ప్రజలు మున్సిపా లిటీలో అవినీతి పెరిగిపోవడంతో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు అధికారులతో కురుముక్కై అవినీతి అక్రమాల సొమ్ములు పంచుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ అవసరాల కోసం మున్సిపాలిటీకి వెళ్తే పలుకుబడి ఉన్న నేతలుగాని అధికా రులు గానీ సంప్రదించి పనిచేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

అవినీతి నిర్మూలన కొత్త ఎజెండా 

నిర్మల్ జిల్లాలోని నిర్మల్ బైంసా మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో అవినీతి అక్రమాల ను చెక్కు పెట్టెందుకు కొత్త పాలకవర్గం మొదటి ఎజెండా పెట్టుకోవడం ప్రజలు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం రోజు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పా ల గణేష్ చక్రవర్తి. భైంసా మున్సిపల్‌లో చైర్మన్ తుమ్మల దత్తాద్రి తదితరులు ప్రజల సమక్షంలోని అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో పనిచేసే అధి కారులు అవినీతి అక్రమాలు, లంచాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రజ లు కూడా అధికారులకు లంచాలు ఇవ్వవద్దని ఏదైనా అవసరం ఉంటే తమను గానీ, తమ కౌన్సిలర్లుగాని సంప్రదించాలని ప్రజలకు బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఏ ఏ విభగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో ఆ విభాగాలుపై ప్రత్యేక దృష్టి పెట్టామని హెచ్చరించారు. ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయవలసిన అధికారులు పైసల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని వారు ఘాటుగా హెచ్చరిం చారు.

నిర్మల్ లో గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఘనచక్రవర్తి వైస్ చైర్మన్‌గా ప్రస్తు తం కొనసాగుతుండగా పారదర్శక పాలన, ప్రజాకర్షణ పాలన కొనసాగిస్తామని ప్రజల అదృష్టం మేరకు పనిచేస్తామని తెలిపారు. దీనికి తోడు ప్రతిరోజు పట్టణంలోని 42 వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని వారి అవసరాల ను తీర్చేందుకు కృషి చేస్తామని ప్రజలకు భరో సా కల్పించారు.

లంచం తీసుకోవడం ఎంత నేరము. ప్రజలు లంచం ఇవ్వడం కూడా అంతే నేరంగా పరిగణింపబడతామని ప్రజలు ఎవరికి లంచాలు ఇవ్వకుండా పనిచేసుకునే అవకాశం కల్పిస్తామని నేతలు ప్రకటించడం తో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో పారదర్శకమైన పాల న, ప్రజలకు జవాబుదారు పాలన అందిస్తామని చెప్పడంతో ఆ దిశగా కొత్త పాలకవర్గం చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకుని అమలు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నాను. 

అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. 

కొత్త మున్సిపల్ పాలకవర్గంలో ప్రజలు తమపై విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారు. నిర్మల్ మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ అందే విధంగా చర్యలు తీసుకుంటాం. అవినీతి అక్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టినం.

ప్రజలచేత ఎన్నుకోబడ్డ పాలకవర్గం ప్రజల కోసం మాత్రమే స్వచ్ఛందంగా పంచేయవలసిన అవసరాన్ని గుర్తించాం. ప్రజలు కూడా తమకు సహకరించాలి.  అప్పల కావ్య, మున్సిపల్ చైర్మన్