‘ఒపెక్’ నుంచి యూఏఈ నిష్క్రమణ
29-04-2026 12:23 AM
అబుదాబీ, ఏప్రిల్ 28: ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) సంస్థ నుంచి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తప్పుకోవాలని నిర్ణయించుకున్నది. గల్ఫ్ దేశాల వాణిజ్యాభివృద్ధి కోసం ఒపెక్ సంస్థ చేస్తున్న కృషిని తాము అభినందిస్తున్నామని, కానీ.. ఇకపై ఆ సంస్థలో తామిక కొనసాగే పరిస్థితులు లేవని తాజా గా ప్రకటించింది. సంస్థ నుంచి బయటకు రావడం వల్ల చమురు ఎగుమతులు, దిగుమతులపై పూర్తిగా తమ దేశానికే సర్వాధి కారాలుంటాయని తెలిపింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ ఇంధన రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.






