ప్రజలకు పారదర్శకమైన పాలన
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
వనపర్తి/నాగర్‌కర్నూల్, జూన్ 11 (విజయక్రాంతి): ప్రజ లకు పారదర్శకపాలనను అందించేందుకు అధికారులు కృషిచేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కొల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్‌గల్ మండలాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పాన్‌గల్ నుంచి కదిరెపాడు బీటీ రోడ్డు, తూంకుంట పీఆర్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్తుశాఖ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.
గోపల్‌దిన్నె రిజర్వాయర్ నుంచి వీపనగండ్ల, పాన్‌గల్, చిన్నంబావి మండలాలకు వచ్చే మిషన్‌భగీరథ నీరు పచ్చగా వస్తున్నదని.. లోపం ఎక్కడుందని ప్రశ్నించారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భీమా, కల్వ కుర్తి, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఆరా తీశారు. చిన్నంబావి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు, చెల్లంపాడులో 700 ఎకరాలకు సాగునీరును అందించేందుకు ఉన్న సమస్యలపై నివేదికను సిద్ధం చేయాలని సూచించా రు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నిధుల్లో రూ.8 కోట్లు విద్యకే!
తన నిధుల్లో రూ.8 కోట్లు విద్యకే కేటాయిస్తానని మంత్రి జూపల్లి తెలిపారు. మంగ ళవారం కొల్లాపూర్ మండలం సింగోటంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశా రు. రత్నగిరి ఫౌండేషన్ ద్వారా పెద్దదగడ, పెద్దమారు, కొండూరు, సింగోటం గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు మొదటి విడతగా ఎన్నిక చేశామని తెలిపారు.






