పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదు..
- మా కార్పొరేటర్ లను గురి చేస్తుండ్రు
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోకపోతే ఎట్టి పరిస్థితిలో సహించబోమని మా జీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తోపాటు మరి కొంతమంది నేతలు బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన కా ర్పొరేటర్ లను కాంగ్రెస్ లోకి తీసుకున్నందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, మీరు అడిగింది ఇస్తాం అవసరమైన పదవులు అందుబాటులో ఉంచుతామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మార్కె ట్ చైర్మన్ , మూడ చైర్మన్, రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని పార్టీ మారాలని చర్చ లు జరపడం సమంజసం కాదన్నారు. కా ర్పొరేటర్లు చేర్చుకోవాలనుకుంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ బీఆర్‌ఎస్ లో చేరాలన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి సహక రించాలని మేమంతా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించామని, ఈ తరుణంలో ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా ధన్యవాదాలు తెలిపి రెండు నెలలు కూడా గడపకముందే మా పార్టీలోకి రండి అని సంప్రదింపులు చేయ డం సరికాదన్నారు.
బిసి మేయర్ కు సముచిత స్థానం ఉండాలనే ఉద్దేశంతోనే మొదటి సమావేశంలో ప్రశ్నించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది అసంతృత్తులు ఉన్నారని, ముందు మీ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. పార్టీలు మారితే పోలీసులు మీ దగ్గరికి రారు? అవసరమైన సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంటాయని చెప్పడం వెనక ఉన్న అంతరిమేమిటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు చెప్పినట్లు పోలీసులు ఎట్టి పరిస్థితుల వినకూడదని సూచించారు. నగరంలో రూ 50వేల మోటార్లకు డబ్బులు లేవని అంటున్నారని ఇలాంటి సమయంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చాంబర్లు కట్టుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నవారికి ఛాంబర్లు ఎలా ఉన్న పని చెయ్యాలని డిమాండ్ చేశారు.
కార్పొరేటర్లతో మధ్యవర్తులు ద్వారా సంప్రదింపులు చేసి ప్రలోభాలకు గురి చేస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింలు, మాజీ ముడా చైర్మన్ గంజి వెంకన్న, పట్టణ అధ్యక్షులు శివరాజు, కార్పొరేటర్లు కిషోర్, తదితరులు ఉన్నారు.




