30 June, 2026 | 10:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి

05-05-2026 05:33 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ నగరంలోని బొక్కలగడ్డలో మంగళవారం ఉదయం చైన్‌ స్నాచింగ్‌ కలకలం సృష్టించింది. సిటిజన్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి, వృద్దురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయిన సంఘటన సంబంధించి సిసి కెమెరాల ఆధారం గుర్తించిన చైన్ స్నాచింగ్ పాల్పడిన నిందితుడి చిత్రాన్ని హన్మకొండ పోలీసులు విడుదల చేశారు. గ్రీన్ కలర్  టీ షర్ట్, నల్ల ప్యాంట్, క్యాప్ ధరించిన నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హన్మకొండ ఇన్స్ స్పెక్టర్ మచ్చ శివ కుమార్ తెలిపారు.