పాపన్న స్ఫూర్తితోనే రాజ్యాధికారం
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు ఏకం కావాలి
- మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): సామా న్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టి, అణగారిన వర్గాలను ఏకం చేసి మొఘ ల్ అధికారాన్ని సవాలు చేస్తూ రాజ్యాధికారం దిశగా ఎదిగిన సర్దార్ సర్వా యి పాప న్న గౌడ్ స్ఫూర్తిని నేటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు అందిపుచ్చుకోవాలని మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని మీడియా సెంటర్ లో మంగళవారం బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన నివాళులర్పించారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్కుమార్ తదితరులు ప్రసంగించారు.
పాపన్న జీవిత చరిత్రను నేటి సా మాజిక, రాజకీయ పరిస్థితులతో అనుసంధానించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పూర్ణచంద్రరావు అన్నారు. పాపన్న గొప్పతనం ఆయన వెం ట నడిచిన ప్రజల సామాజిక వైవిధ్యంలోనూ కనిపిస్తుందని పూర్ణచంద్రరావు చెప్పారు. “పాపన్న కాలం లో అధికా రానికి కోటలు ప్రతీకలు. నేడు అసెంబ్లీ, పార్లమెంట్, మంత్రివర్గాలు అధికార కోటలు. పాప న్న కాలంలో ఈటె, కత్తి ఆయుధాలైతే, ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు.
కోటల ను బద్దలు కొట్టడం అంటే ఇప్పుడు భౌతికంగా దాడి చేయడం కాదు; ఓటు ద్వారా అధికార నిర్మాణాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మార్చడం” అని పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూ ర్యారావు, ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్‌కుమార్ భావనా సాహెబ్, విద్యార్థి నాయకుడు గణేష్ పాల్గొన్నారు.






