12-08-2025 12:18:58 AM
తాహెర్‌బిన్ హందాన్
నిజామాబాద్ ఆగస్టు 11 (విజయ్ కాంతి) : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన కార్యదర్శి,రాష్ర్ట ఆర్ జీ పి ఆర్ ఎస్. ఇంచార్జి సుభాష్ యాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ అనేది రాజీవ్ గాంధీ గారు తీసుకున్న ఒక సృజనాత్మక నిర్ణయమని, గ్రామాలలో పంచాయతీలకు అధికారం ఇచ్చినప్పుడే నేరుగా నిధులను కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు మున్సిపాలిటీలకు అందించినప్పుడే దేశంలో అభివృద్ధి జరుగుతుందని భావించిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగిందని ద్వారా దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడిందని ఆయన అన్నారు.
ఆర్టికల్ 72,73 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలాకే హక్కులు కల్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా ఆర్ జి పి ఆర్ ఎస్ అధ్యక్షులు గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన సమావేశం జరిగింది. మహోన్నత వ్యక్తులైన మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ ల స్ఫూర్తితో ఈరోజు రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టిన పాదయాత్రలు ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ఎవరి వాటా ఎంతో వారికి అది చెందాలి అనే ఆలోచనతో బీసీ రిజర్వేషన్ చేపట్టే విధంగా కృషి చేశారని జరిగిందని ఆయన అన్నారు.
గ్రామస్థాయిలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు పార్టీ బలోపేతం అవుతుంది అని గుర్తుంచుకోవాలని తాహేర్ బిన్ హందాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన ద్వారా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ ,ప్రజల వద్దకే వెళ్తూ వారికి కావాల్సిన అవసరాలు తెలుసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ జీ పి ఆర్ ఎస్ జోనల్ ఇంచార్జి మోత్కురి నవీన్,వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్,సంతోష్ రెడ్డి, ఇందుర్ శేఖర్,వెంకటేశ్వర పటేల్, ఇట్టం జీవన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్,వివిధ మండలాల అధ్యక్షులు బోదిరే స్వామి,ముత్యం రెడ్డి, లక్ష్మణ్, షహీద్,సాయిరెడ్డి, చిన్న బాలరాజు,విజయ్,భూమేష్ రెడ్డి, మహిపాల్, రవి ప్రకాశ్,మాజీ జెడ్పీటీసీ లు,మాజీ ఎంపీపీ లు,మాజీ సర్పం లు తదితరు లుపాల్గొన్నారు.