11 July, 2026 | 12:37 AM

నిర్మల్‌లో రైతుల ఆగ్రహం… జాతీయ రహదారిపై రాస్తారోకో, ట్రాఫిక్ స్థంభనం!

14-05-2026 01:07 PM

పాల్గొన్న బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి రైతులు 

నిర్మల్‌లో రైతులు ఎందుకు ధర్నా చేశారు?
పంట కొనుగోళ్లలో ఆలస్యం, లారీలు, కూలీలు, గోనసంచుల కొరత వంటి సమస్యలపై నిరసిస్తూ నిర్మల్‌లో రైతులు మహాధర్న నిర్వహించారు.

నిర్మల్ మే 14( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పంట కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి(BJLP Leader Maheshwar Reddy) ఆధ్వర్యంలో రైతులు మహాధర్న నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై మండుటెండలో గంటసేపు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేమని ప్రకటించిన ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో రైతులు పంట కొనుగోల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారుల కాలు మొక్కుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని భుజమెత్తారు.

ఇలాంటి తాజా జిల్లా వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నిలువలు పెరిగిన ప్రభుత్వం కొనుగోలు చేపట్టాకపోగా లారీలు కూలీలు గోలసంచల కొరత సమస్యలు పట్టించుకోవడంలేదని గజమెత్తారు. రైతులే స్వయంగా కూలీలుగా మారుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కట్టింగులు గోన సంచుల మోసం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి తూకం వేగం ఎంత చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అంతకుముందు లక్ష్మణ మండలం రాజాపూర్ గ్రామంలో రైతులు చేసిన ధర్నాలు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు పలికారు.

మరిన్ని తెలంగాణ జిల్లా వార్తల కోసం మా నిర్మల్ జిల్లా విభాగాన్ని చూడండి.

FAQ's

Q1: నిర్మల్‌లో రైతులు ఎందుకు నిరసన చేపట్టారు?

పంట కొనుగోళ్లలో సమస్యలు, లారీలు, కూలీల కొరత కారణంగా.

Q2: ఎవరి నేతృత్వంలో ధర్నా జరిగింది?

మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో.

Q3: ఎక్కడ రాస్తారోకో జరిగింది?

ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై.