14 May, 2026 | 2:23 PM

​కాంగ్రెస్ గూటికి ‘ఇండిపెండెంట్’ సర్పంచ్

14-05-2026 01:22 PM

 సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులవుతున్న నేతలు

​అమనగల్లు, మే 14: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'ప్రజా పాలన' అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా, అమనగల్ మండలం అకుతోటపల్లి  గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ నరేందర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

​ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ​ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్టం లో ​మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,​గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల, ఉచిత విద్యుత్,​పేదల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పంపిణీ,

​నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలోనే రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే చెప్పారు.​సర్పంచ్ నరేందర్ రెడ్డి పార్టీలో చేరడం వల్ల అకుతోటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని స్థానిక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.