calender_icon.png 16 December, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిష్కరిస్తే బాంబులు పెట్టి కూల్చేస్తాం

15-12-2025 01:01:08 AM

  1. రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహ రగడ

గద్దర్, బెల్లి లలితలను విస్మరించి ఆంధ్రా గాయకుడికి పట్టం కడతారా అని ఫైర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి వద్ద సమైక్యవాది అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరిస్తే బాంబులతో పేల్చేస్తామని తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు హెచ్చరించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు భగ్గుమన్నారు.

ఆదివారం రవీంద్రభారతి వద్దకు చేరుకున్న వందలాది మంది ఆందోళనకారులు ‘వద్దు వద్దు.. ఆంధ్రా విగ్రహాలు వద్దు.. నశించాలి ఆంధ్రా ఆధిపత్యం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ..

తెలంగా ణ ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రజా యుద్ధనౌక గద్దర్, గూడ అంజయ్య, బెల్లి లలిత, అందెశ్రీ, దాశరథి వంటి మహానుభావుల విగ్రహాలు పెట్టకుండా డబ్బుల కోసం పాడే కమర్షియల్ ఆర్టిస్ట్ విగ్రహం ఇక్కడ ఎందుకు పెడుతున్నారని నిలదీశారు.    విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికల్లో రేవంత్‌రెడ్డి, వెంకయ్య నాయుడు, భట్టి విక్రమార్క వంటి పేర్లు ఉండటాన్ని చూపిస్తూ.. ఆ పత్రికలను అక్కడికక్కడే చించివేసి, నిరసన తెలిపారు.