15-12-2025 01:04:49 AM
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ప్రవేశ (సెట్స్) పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో తెలంగాణ ఉన్నత వి ద్యామండలి చర్యలు చేపట్టింది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వ హించే టీజీ ఎప్‌సెట్ (ఎంసెట్) పరీక్షలు 2026 మే మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. మే 4, 5 తేదీల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి ప్రభు త్వం ఆమోదం లభించా ల్సి ఉంది.
జేఈఈ మెయిన్2 పరీక్షలు ఏప్రిల్ 2నుంచి 9వరకు, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు మే 17న జరగనుంది. ఇంటర్ వార్షి క పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగనున్నాయి. ఈ తేదీలను దృష్టి లో పెట్టుకొని షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎప్‌సెట్ నోటిఫికేషన్, మార్చి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.