కనుల పండువగా స్వామివారి కల్యాణం
15-12-2025 12:48 AM
కుటుంబ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ,డిసెంబర్ 14 (విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 51 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఎంతో వైభవంగా జరిగిన మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని కళ్యాణం తిలకించారు.లోక కల్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమం అంతా మంచి జరగాలని వేడుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు రాజేందర్ రెడ్డి కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయిని లక్ష్మా రెడ్డి,డివిజన్ అధ్యక్షులు కొండ నాగరాజు,ఆలయ కమిటీ చైర్మన్ రంగనాయకమ్మ ,నరేందర్,సబితా రెడ్డి,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






