ఐఎఫ్‌డబ్ల్యూజే అధ్యక్షుడు కోటంరాజు విక్రమరావు మృతి
13-05-2025 12:00 AM
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): సుదీర్ఘ కాలం జర్నలిస్టు ఉద్యమంలో పనిచేస్తూ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఐఎఫ్‌డబ్ల్యూజే) అధ్యక్షుడిగా ఉన్న కోటంరాజు విక్రమరావు(82) లక్నోలో సోమవారం ఉదయం మరణించారు. శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
విక్రమరావు మరణం పట్ల నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్ (ఎన్‌ఏజే), ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఎన్‌ఏజే తెలంగాణ యూనిట్ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి. ఐదు దశాబ్దాలుగా జర్నలిస్టు ఉద్యమంలో విక్రమరావు కీలకపాత్ర పోషించారు. జర్నలిస్టుల వేజ్‌బోర్డులో, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు.






