calender_icon.png 13 May, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కష్టాలు తీర్చాలి

12-05-2025 11:39:27 PM

అధికారులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆదేశం 

గూడూర్: భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జాతీయ ఎఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామంలో అటవీ భూముల పై రైతులు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న రైతుల భూములను వరంగల్ మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు కాలేదని, ఈ విషయంపై అధికారులు సర్వే నిర్వహించి వారి దరఖాస్తులను పరిశీలించి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే భూమి ఉన్న ప్రతి రైతు బావులు తీసుకొని వ్యవసాయం చేయడానికి అనుమతి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.