13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

నేడు ఇళయరాజా లైవ్ కాన్సర్ట్

28-03-2026 02:11 AM

సంగీత మాంత్రికుడు ఇళయరాజా 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లో భారీ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. జోరా వరల్డ్ ఆధ్వర్యంలో శనివారం జరగనున్న ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి స్టేడియం వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక సంగీత వేడుకలో ఇళయరాజా తన మధురమైన గీతాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలను ఇళయరాజా స్వయంగా వెల్లడించారు. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్వాహకులు సంజయ్‌కుమార్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, మోహిత్ పాల్గొన్నారు.