అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్.. అడ్డూ అదుపు లేదు!
- హెచ్‌ఎండీఏ తిరస్కరించిన స్థలంలోనే కట్టడాలు
- ‘ది పెర్చ్’ అక్రమ నిర్మాణంపై ఆరోపణలు అనుమతి రద్దు చేసినా మళ్లీ కొనసాగుతున్న పనులు
- రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కమర్షియల్ కట్టడం
- సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలో మెగా మెడోస్ సంస్థ ఆగడాలపై విమర్శలు
సంగారెడ్డి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ తిరస్కరించినా, హైకోర్టు ఆదేశాలు జారీచేసినా, మున్సిపాలిటీ ఉత్త ర్వులు రద్దుచేసినా అక్రమ నిర్మాణాలు ఆగడంలేదు. దర్జాగా ని ర్మాణాలు జరుగుతున్నా హెచ్‌ఎండీఏ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు సైతం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు విన వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ దందా కొనసాగుతుందనే విమర్శలూ ఉన్నాయి.
స్పష్టమైన ఆదేశాలు ఉన్నా రద్దుచేసిన స్థలంలోనే ‘ది పెర్చ్’ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతుండటం వివాదాస్పదంగా మా రింది. 2021లో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 407/ఏఏలో 16,295 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ విల్లాల నిర్మాణానికి హెచ్ ఎండీఏ అనుమతి ఇచ్చింది. అయితే ఇం దు లో 700 జగాల స్థలాన్ని పూర్తిగా తిరస్కరించింది.
అయినప్పటికీ తప్పుడు పత్రాలతో 22- 12- తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి మేఘా మెడోస్‌కు క్లియరెన్స్ తీసుకుని, రద్దుచేసిన స్థలంతో సహా ప్లాట్ నంబర్లు 1 నుంచి 5 వరకు కలిపి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించినట్టు ఆరోపణలున్నాయి. ఇది హెచ్‌ఎండీఏ లేఅవుట్ అని, డీజీపీఏ నిబంధనలకు విరుద్ధమని విల్లా యజమానుల్లో ఒకరు అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారా ల్లో చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ మున్సిపాలిటీని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 29 నవంబర్ 2024న జారీచేసిన బిల్డింగ్ పర్మిషన్‌ను రద్దుచేస్తూ మున్సిపాలిటీ ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ నిర్మాణ పనులు ఆగలేదు. కాలపరిమితి ముగిసిన అనుమతులతోనే ప్రస్తుతం నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం.
అభయహస్తం ఎవరిది?..
మెగా మెడోస్ నిర్మాణ సంస్థ ‘ది పెర్చ్’ పేరుతో 16,295 చదరపు మీటర్లలో విల్లాల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ నుంచి 2001 లో అనుమతులు పొందింది. అర్జీ పెట్టుకున్న లే ఔట్‌లోనే 1 నుంచి 5 వరకు ఉన్న ప్లాట్లు దాదాపు 700 గజాల స్థలాన్ని మాత్రం రిజెక్ట్ చేసి మిగతా స్థలంలో విల్లాల నిర్మాణానికి అనుమతులు జారీచేసింది. ఇంతవరకు సవ్యంగానే ఉన్నా అప్పటి అధికారులను ప్రసన్నం చేసుకొని తప్పుడు పత్రాలు సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో ఈ స్థలంలో నిర్మాణాలకు అనుమతులు పొందారు.
నిర్మాణాలు సాగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులను ప్రశ్నించారు. దీంతో నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అక్రమ అనుమతులు తీసుకున్న కాలపరిమితి సైతం ముగిసిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి అదే నిర్మాణాన్ని ఒక్కసారిగా వేగం పెంచారు. సదరు అక్రమ నిర్మాణాలకు అభయహస్తం అందిస్తున్న అధికారి ఎవరు? అంటూ స్థానికంగా చర్చ జరుగుతున్నది.
అనుమతులు రద్దుచేసినా ఇష్టారా జ్యంగా నిర్మాణాలు చేపడుతున్న మెగా మెడోస్ నిర్మాణ సంస్థ ఆగడాలను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్న వినిపిస్తున్నది. రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో కమ ర్షియల్ కట్టడం మున్సిపాలిటీస్ చట్టం- -2019, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 300ఏ కు విరుద్ధమని స్థానికులు పేర్కొంటున్నారు. పర్మిషన్ రద్దు చేసినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్మిషన్ రద్దుచేసినా చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? అ క్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్నది ఎవ రు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతా ధికారులు స్పందించి, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కమర్షియల్ నిర్మాణాల విషయంలో తెల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి వివరణ కోసం ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించగా, ఆమె అందుబాటులోకి రాలేదు.






