18-09-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): నిజాంపేట్ కార్పొరేషన్ లో అక్ర మార్కులు రెచ్చిపోతున్నారు. ఏలా నిర్మిస్తే మాకెవ్వడు అడ్డు అనేలా విర్ర వీగుతూ ఎడా పెడా అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారు.అంతంతా మాత్రమే అనుమతులు తీసుకొని అక్రమాల రాజ్యాలను నెలకొలపుతున్నారు.కమర్షియల్ భవంతులు,్ర పమాద పుటంచున భవనాలు, అక్రమ షెడ్స్ నిర్మి స్తూ మున్సిపల్ ఆదాయానికి శఠగోపం పెడుతున్నారు.
కళ్లేదుటే మున్సిపల్ ఆదాయానికి రూ. కోట్లు నష్టం చేస్తూ, పట్టణ ప్రణాళికను చిన్నా భిన్నం చేస్తూ ధర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కంట్రోల్ చేయాల్సిన మున్సిపల్ అధికార యంత్రాం గం చేష్టలుడిగి చూస్తూ కూర్చోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది.
ప్రగతి నగర్ జీపీఆర్ లే అవుట్‌లో అక్రమార్కుల తిష్ట...
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జీపీఆర్ లే అవుట్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు,పాక్షిక అనుమతు లు తీసుకుని కొందరు, అక్రమ షెడ్స్ వేస్తూ ఇంకొందరు ఇలా అక్రమ నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడు తున్నారు.రూ. కోట్లలో మున్సిపల్ ఆదా యం అక్రమ నిర్మాణాలతో కోల్పోతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవ డం లేదు. ఇక్కడ ఓ బిల్డర్ హెచ్‌ఎం డీఏ అనుమతులు తీసుకొని సుమారు 400 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు భవంతులు నిర్మిస్తున్నాడు.
అయితే ఈ భవంతులను హెచ్‌ఎండీఏ అప్రూవల్ ప్లాన్ ప్రకారం కాకుండా ప్లాన్ వైలేట్ చేస్తూ అక్రమ ఫ్లోర్స్ నిర్మాణం చేపట్టాడు.వాటర్ ట్యాంక్ సాకుతో మరో 2బీహెచ్కే నిర్మాణం కోసం స్లాబ్స్ వేసి వదిలేశాడు. హెచ్ ఎం డీ ఏ నుండి ఓసీ, మార్టిగేజ్ లు రిలీజ్ అయ్యా క సడీ సప్పుడు కాకుండా దొంగ చాటుగా మరో అక్రమ నిర్మాణం చేపట్టెందుకు కుయుక్తులు పన్నుతు న్నాడు. ప్లాన్ ప్రకారం కాకుండా ఇలా ఎందుకు ఎక్సట్రా స్లాబ్స్ వేశావ్ అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తన ప్రాపర్ అప్రూవల్ ప్లాన్ షో చేయకుండా అధికారులకు సవాల్ విసురుతు న్నాడు.
జీపీఆర్ లే అవుట్ లో మరో బిల్డర్ ఏ మాత్రం మున్సిపల్ అనుమతులు లేకుండా సుమా రు 250 చదరపు గజాల విస్తీర్ణం లో ధర్జాగా జీ +1 భవంతి నిర్మిస్తున్నాడు.ఇక్కడ ఆర్‌ఓ గా పని చేసి వెళ్లిన ఓ అధికారి ప్రస్తుతం పక్క మున్సిపాలిటీ లో కమిషనర్ గా విధులు చేపడుతున్నాడు.ఆ కమిషనర్ ఇక్కడి నిజాంపేట్ మున్సిపల్ అధికారులకు ఆ అక్రమ నిర్మాణం తనదే అక్కడికి వెళ్ళకండి అంటూ హుకుం జారీ చేయడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు గప్ చుప్ గా ఉంటూ అక్రమ నిర్మాణంకు ప్రత్యక్ష సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదేవి దంగా అదే ప్రాంతంలో మరో బిల్డర్ సుమారు 200 చదరపు గజాలలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా జీ+2 బిల్డింగ్ నిర్మించి ధర్జాగా కమర్షియల్ షెటర్స్ ఏర్పాటు చేశాడు. ఈ భవంతి పై కోర్టు లో స్టేటస్ కో ఉన్నా చక చకా అక్రమ నిర్మాణం పనులు చేపడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నాడు.అలాగే ఏడీఆర్ హై రైజ్ బిల్డింగ్స్ సమీపంలో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్స్ నిర్మాణం ధర్జాగా చేపడుతూ అక్రమార్కులు రాజ్యం ఏళుతున్నారు.
ఇలాంటి అక్రమ నిర్మాణాల పరంపర నిజాంపేట్ కార్పొరేషన్ లో నిత్యం చోటు చేసుకోవడం అధికారులు మౌనం వహించడం పై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి.అయితే ఈ అక్రమ నిర్మాణలపై నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీపీవో వివరణ కొరకు ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించడం లేదు.