18-09-2025 12:00:00 AM
-కాంగ్రెస్‌తోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ది
-ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు
మంచిర్యాల, సెప్టెంబర్ 17 (విజయక్రాం తి) : దేశం, రాష్ట్రం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలు మరువలేనివని, వారి పోరా టాల ఫలితంగానే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మహానీయుల చిత్ర పటాల కు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి న తర్వాతనే రేషన్ కార్డులు అందజేసి సన్న బియ్యం పంపిణి చేస్తున్నామని, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా పథకాలతో పాటు పండించిన పంటలను కొనుగో లు చేస్తున్నామన్నారు. భూభారతితో భూము ల సమస్యలు పరిష్కరిస్తున్నామని, విద్యారం గం బలోపేతం కోసం 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణం, పాఠశాలల మరమ్మతులు చేయిం చి నాణ్యమైన విధ్యను అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీలు, జీపీల అభివృద్ది కోసం నిధు లు మంజూరు చేసి ప్రజలకు నాణ్యమైన సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఎఫ్‌ఓ శివ్ ఆశీష్ సింగ్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.