29 May, 2026 | 2:55 AM

ప్రభుత్వ భూముల్లో మొరం అక్రమ తవ్వకాలు

29-05-2026 12:29 AM

యథేచ్ఛగా రవాణా చేస్తున్న అక్రమార్కులు

తాండూరు, మే 28 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఏవి లేకుండా మొరం మట్టి తవ్వ కాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూమి సర్వే నంబర్  277 లో కొందరు అక్రమార్కులు జెసిబి యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ, టిప్పర్ భారీ వాహనాల తో గత కొన్ని రోజులకు నిత్యం పదుల సం ఖ్యల్లో తవ్వకాలు జరుపుతూ  యదేచ్ఛగా ర వాణా సైతం  చేస్తున్నారు. బహిరంగ మార్కె ట్లో ఒక్కో టిప్పర్ మొరం మట్టిని దాదాపు పదివేల రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అనుమతులు లేకుండా తవ్వకాలు ,రవాణా చేస్తుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం  భారీగా గండిపడుతుంది. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు,రవాణా పట్టపగలే చేస్తున్నా సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులు  పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.   అక్రమార్కులకు అడ్డుకునే అధికారులు ఎవరూ లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా  తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.